ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కల్తీ...కల్తీ...సర్వం కల్తీ...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 12:57 AM

-అన్ని వస్తువులు కల్తీమయం    
-కొనితెచ్చుకుంటున్న అనారోగ్యం    
-నామమా్తప్రు చర్యలతో సరి  
-ఎక్కడా కనిపించని అధికారుల దాడులు  
-మోసపోతూనే ఉన్న జనం
కరీంనగర్‌, సూర్యప్రత్యేకప్రతినిధి : అధికారు నిర్లక్ష్యం, ప్రజల అమాయ ƒత్వాన్ని ఆసరగా చేసుకుంటున్న వ్యాపారులు కల్తీ వస్తువుల విక్రయాలు చేస్తు సొమ్ము చేసుకుంటున్నారు. ఎందెందు వెతికినా అందందు కలదన్నట్లు అన్ని ర కాల నిత్యావసర సరుకుల్లో జోరుగా కల్తీ జరుగుతోంది. గత కొన్ని నెలల క్రితం ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుళ్లిన మాంసం బొక్కలతో నూనె తయారు కేంద్రాన్ని అధికారులు గుర్తించి నిర్వాహకులను పట్టుకున్నారు. అదే విధంగా జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో కూడా ఇదే రకంగా కల్తీ నూనెను తయారు చేసి వ్యక్తికి పోలీసులు పట్టుకున్నారు. నూతనంగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లాలో జిల్లా ఎస్పి అనంతశర్మ భాధ్యతలు చేపట్టాక జిల్లా కేంద్రంలో 2నూనే మిల్లులపై దాడులు చేసి కల్తీ నూనెను స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేశారు. ఈ కేసులే కాకుండా ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాలలో నూనెనె కాకుండా అనేక వస్తువుల కల్తీ జరుగుతున్నట్లు విశ్వనీయ సమాచారం.
ముఖ్యంగా పిండి పదర్థాలు, నూనెలు, కారంపొడి, పసుపులో ఎక్కువ కల్తీ జరుగుతున్నట్లు తెలుస్తొంది. మహారాష్ట్ర నుంచి నాణ్యతలేని సరుకులను తక్కువ ధరకు తెచ్చి మనవద్ద అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను నిలువునా ముంచుతున్నారనే విమర్శలున్నాయి. ఎంత సంపాదించినా ఖర్చు  విషయంలో ఆహార పదార్థాలకే మనం అధిక ప్రాధాన్యత ఇస్తాం. తిండి విష యంలో రాజీపడితే బతుకుబండి సాగదు గనుక నాణ్యమైన పండ్లు, కూరలు, పప్పు లు, నూనెలు, బియ్యం ఇతర పదర్థాలు కొనాలని అందరు  భావిస్తారు. ఈ భావనే కల్తీ వ్యాపారులకు బలంగా మారుతోంది. అధిక లాభాలకు ఆశపడి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే రసయానాలు, నాసిరకం వస్తువులు కలిపి కొందరు వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. సాధరణ ప్రజలే కాదు, చదువుకున్నవారు సైతం ఆహార పదర్థాల్లో కల్తీ జరిగిన విషాయన్ని గుర్తించ లేక పోతున్నారు. ఒకప్పుడు మామిడి పండ్లను మగ్గించేందుకు మాత్రమే కార్బయిడ్‌ వంటి విషపూరిత రసాయానాలు వినియోగించేవారు. ఇప్పుడు అన్ని రకాల పండ్లలను రసాయానాలతో కుత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. దీంతో ఏ పండ్లను కొనాలన్నా జనం భయపడే పరిస్థితి  నెలకొంది. దీర్ఘకాలికంగా కల్తీ ఆహార పదార్థాలను  తినడం, పానీయాలను సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతి నడం ఖాయం. కల్తీ ఆహార పదర్థాలు, పండ్లను తినడం వల్ల క్యాన్సర్లు, ఉదర కోశ వ్యాధులు వచ్చే ప్రమాదముంది. మహిళల్లో గర్భస్రావాలు, పిల్లల్లో ఎదుగు దల లోపించడం, వృద్దులో నిద్రలేమి, అలసట వంటి అనారోగ్యాలు అనివార్య మవుతాయి. జీవన ప్రమాణాలపై కల్తీ ప్రభావ… ం పడుతుందని నిపుణులు చెబు తున్నారు. జంతు కళేబరాలతో వంట నూనెలు, యూరియా వంటి రసాయా నాలతో పాలు, హానికారక పదర్థాలతో నెయ్యి, కుత్రిమంగా మగ్గబెట్టిన పండ్లు, ఇలా కల్తీ సర్వాంతర్యామి అయిపోయింది. గతేడాది నిర్మల్‌ జిల్లాలో జంతు కళేబరాలతో నూనెలు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. పోలీసులు ఈ ఒక్కటే కాదు అనేక రకాల  వస్తువులు కల్తీ అవుతున్నా అది మనకు తెలియ డం లేదు. మరోవైపు న్యాయస్థానాలు ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాల్షియం కార్బెడ్‌ను వినియోగించి పండ్లను కృత్రిమంగా మగ్గబెడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకో వాలని గతంలో ఉమ్మడి  హైకోర్టు ఆదేశించింది. స్పందించిన అధికారులు వెంటనే రంగంలోకి దిగి కల్తీ మయం చేస్తున్న కొందరు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ఇది జరిగి యోడాది గడిచి పోయింది. మళ్లీ వేసవికాలం ప్రారంభమైంది. మార్కెట్‌లోకి సీజన్‌ కంటే ముందే అనేక రకాల పండ్లు వచ్చా యి. నిగనిగలాడుతు ఆకట్టుకుంటున్నాయి. మరీ ఆ పండ్లు నాణ్యమైనవా.. లేదా కల్తీ ఆయ్యాయా తేల్చాల్సిన భాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. కానీ సదరు అధికారులు ఇప్పటి వరకు రంగంలోకి  దిగలేదు. ప్రస్తుత మార్కెట్‌లో ఏది కొందామన్నా ఏది తిందామన్నా ఏది అన్ని కల్తీవే. పప్పులు సైతం  ఆరో గ్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఎంత డబ్బు పోసినా నాణ్యమైన పప్పు లు లభిం చని పరిస్థితి ఏర్పడింది. పప్పులు, పండ్లు, కూరƒ లే కాదు. ఇప్పుడు మార్కెట్‌లో కల్తీకాని  సరుకులే కనిపించడం లేదు. నెయ్యి, నూనెలు, సౌందర్య ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, మిఠాయిలు, శీతల పానీయాలు, పచ్చళ్లు, పాలు, నీళ్లు ఇలా ఏది చూసినా కల్లీ మయమే. కల్తీలు, నకిలీల నివారణకు పలు ప్రభుత్వ శాఖ లున్నా నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నాయి తప్పితే అక్రమ వ్యాపా రాలకు తెరదించడం లేదని ప్రజల వాదన. తూనికలు- కొలతలు, పౌర సరఫ రాలు, కల్తీ నిరోదకశాఖ, విజలెన్‌‌స, పోలిసు, వాణిజ్య పన్నుల శాఖ, ఇలా ఎన్నె న్నో ప్రభుత్వవిభాగాలు ఉన్నా కల్తీలపై పూర్థిస్థాయిలో దృష్టి సారిస్తున్న దా లా లు లేవు. వంటల్లో ఘటైనా వాసన కోసం, మంచి రుచి కోసం మిరియాలు, గసగసాలు, జీలకర్ర, పసుపు, లవంగాలు, యాలకులు, ఇత ర సుగంధ ద్రవ్యా లను వాడుతుంటారు. వీటిలో కల్తీ జరుగుతున్నా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com