గద్వాల : జొగులంబ జిల్లా గద్వాల, అలంపూర్, ప్రచారానికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్తూ అడ్డాకుల, జె.ఆర్ గెస్ట్ హౌస్ లో సేదతీరారు. అడ్డాకుల జాతీయ రహదారి పక్కన ఉన్న జెఆర్ గెస్ట్ హౌస్ లో దేవరకద్ర తాజా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఏంపీ జితేందర్ రెడ్డి ఆయనను కలిసి టిఆర్ఎస్ దేవరకద్ర నియోజకవర్గ ఏన్నికల ప్రచార కార్యక్రమాలపై ఆయనకు వివరించారు. నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.