మహాబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో మాజీ గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ రెండో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన అజ్మీరా చందూలాల్ కు వెలుబెల్లి గ్రామంలో ఘన స్వాగతం లభించింది. గ్రామానికి చేరుకున్న చందూలాల్ ను బోనాలు, బతుకమ్మల ఆట పాటలతో , నృత్యాలతో సాదరంగా స్వాగతం పలికారు.