ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిత్రులకు కాంగ్రెస్ షాక్: సర్దుబాటుకు గండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 19, 2018, 11:53 AM

ప్రజా కూటమి( మహాకూటమి)లో  మిత్రపక్షాలకు  కేటాయించిన స్థానాల్లో కూడ తమ పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. అంతేకాదు తమ పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బీ ఫారాలను అందించింది.ప్రజా కూటమి( మహాకూటమి)లో  మిత్రపక్షాలకు  కేటాయించిన స్థానాల్లో కూడ తమ పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. అంతేకాదు తమ పార్టీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బీ ఫారాలను అందించింది.మిత్రపక్షాలకు కేటాయించిన ఏడు స్థానాల్లో కూడ  కాంగ్రెస్ పార్టీ  తమ అభ్యర్థులకు  బీ ఫారాలను అందించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.తెలంగాణలో టీఆర్ఎస్‌ను గద్దె దింపేందుకుగాను  కాంగ్రెస్, టీఆర్ఎస్,  టీజేఎస్, సీపీఐలు  ప్రజా కూటమి( మహాకూటమి) ఏర్పాటయ్యాయి. మిత్రపక్షాలకు కాంగ్రెస్ పార్టీ 25 సీట్లను  కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. సీపీఐకి3,  టీజేఎస్ కు 8,  టీడీపీకి 14 స్థానాలను కేటాయించింది. మిగిలిన  95 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే తెలంగాణ ఇంటి పార్టీకి  ఒక్క సీటును ఇవ్వనున్నట్టు ప్రకటించినా  పొత్తులు కుదరలేదు. దీంతో  మిత్రులకు కేటాయించిన 25 స్థానాల్లోని ఏడు స్థానాల్లో కూడ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులకు నామినేషన్  బీ ఫారాలను అందించింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగానే తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలను అందించినట్టుగా  చెబుతోంది.  టీజేఎస్, టీడీపీలకు కేటాయించిన స్థానాల్లో కూడ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థులకు బీ ఫారాలను కేటాయించడం కూటమిలోని పార్టీల మధ్య నెలకొన్న గందరగోళానికి   తార్కాణంగా నిలుస్తోంది.వరంగల్ తూర్పు, మహబూబ్ నగర్‌, మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం, హుజూరాబాద్,దుబ్బాకలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాకూటమిలోని మిత్రపక్షాల మధ్య  స్నేహాపూర్వక పోటీ నెలకొనే అవకాశం ఉంది. మిర్యాలగూడలో టీజేఎస్ తమ పార్టీ అభ్యర్థికి నిన్ననే  బీ ఫామ్ కేటాయించింది.  కానీ, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కూడ ఆర్. కృష్ణయ్య బీ పారాన్ని అందించింది.  మహాబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తన అభ్యర్థిగా ఎర్రశేఖర్‌ను  బరిలోకి దింపింది. అయితే  ఈ స్థానం నుండి టీజేఎస్‌ తమ అభ్యర్థిగా రాజేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. రాజేందర్ రెడ్డికి బీ ఫారం కూడ  ఆదివారం నాడు కోదండరామ్ అందించారు.ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాన్ని  కాంగ్రెస్  పార్టీ టీడీపీకి కేటాయించింది. ఈ స్థానం నుండి సామ రంగారెడ్డికి  టీడీపీ కేటాయించింది. సామ రంగారె్డి ఇవాళ ఉదయం బీ ఫారం తీసుకొన్నారు. మరోవైపు  ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పా్రటీ అభ్యర్ధిగా మల్ రెడ్డి రంగారెడ్డి కూడ బరిలో ఉంటున్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ  బీ ఫారం ఇచ్చింది.మరోవైపు టీడీపీకి ఇంకో సీటు  ఇవ్వాల్సి ఉంది.  కానీ ఈ సీటు తేల్చకముందే కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులకు బీ ఫారాలను  కేటాయించింది.  హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి బీ ఫారం  ఇచ్చింది. దుబ్బాక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ టీజేఎస్‌కు కేటాయించింది. కానీ, ఈ స్థానంలో కూడ  కాంగ్రెస్ పార్టీ  తన అభ్యర్థిగా మద్దుల నాగేశ్వర్‌కు బీ ఫారం కేటాయించింది. వరంగల్ ఈస్ట్  స్థానాన్ని టీజేఎస్ తరపున గాదె ఇన్నయ్య పోటీ చేస్తున్నారు. కానీ ఈ  స్థానం నుండి  కూడ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా గాయత్రి రవికి  టికెట్టు కేటాయించింది. బీ ఫారం కూడ అందించింది.ఎల్బీనగర్‌ నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన  ఆర్. కృష్ణయ్య మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించింది. పటాన్‌చెర్వులో  కాట శ్రీనివాస్ కు  కాంగ్రెస్ పార్టీ బీ ఫారం కేటాయించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మిత్రులకు కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫారాలు కేటాయించిన నేపథ్యంలో  టీజేఎస్ కూడ బీ ఫారాలను దాఖలు చేసేందుకు సిద్దమైంది. తాము పోటీ చేయాలని 14 సీట్లలో పోటీ చేయాలని  ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.  కాంగ్రెస్ , టీజేఎస్ మధ్య  కుదిరిన  ఒప్పందం  వర్ధన్నపేట, అంబర్ పేట నియోజకవర్గాల్లో  టీజేఎస్ అభ్యర్థులను ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com