హైదరాబాద్ : ఆంజనేయస్వామి ఆలయం లో పూజలు చేసిన రేవంత్. కోడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి నామినేషన్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమయ్యారు. ఎలాగైనా ర్యాలీని నిర్వహించి తీరుతామని రేవంత్ వర్గం స్పష్టం చేసింది. ఇప్పటికే కోడంగల్‌లో భారీగా పోలీసులు మెహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ను విధించారు.