మెహిదీపట్నంలో ఓటు వేసిన నందమూరి సుహాసిని

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 07, 2018, 08:37 AM
 

హైదరాబాద్: కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న నందమూరి హరికృష్ణ తనయురాలు సుహాసిని తన ఓటు హక్కును మెహిదీపట్నంలో వినియోగించుకున్నారు. మెహిదీపట్నంలో తన ఓటు హక్కును ఆమె నమోదు చేసుకున్నారు. దీంతో శుక్రవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికి ఆమె పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం తను పోటీ చేస్తున్న కూకట్‌పల్లి నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లారని సమాచారం.


Telangana E-Paper