ఓటేసిని మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 07, 2018, 08:47 AM
 

సూర్యాపేట: రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో గల 82వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో సతీసమేతంగా మంత్రి ఓటేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. వీవీప్యాట్‌ల ద్వారా ఓటు ఎవరికి వేశాం అన్నది స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఓటర్లంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా మంత్రి కోరారు.


Telangana E-Paper