ఓటుహక్కును వినియోగించుకున్న నాగార్జున,అమల

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 07, 2018, 09:47 AM
 

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలింగ్ జరుగుతోంది. సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అమల నేడు జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 45లోని బీఎస్ఎన్‌ఎల్ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓ సాధారణ వ్యక్తిలా క్యూ లైన్‌లో వెళ్లి నాగార్జున ఓటు హక్కను వినియోగించుకున్నారు.


 అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరూ విధిగా వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఓటు చేయడం చాలా తప్పనిసరి. మంచి నేతను ఎన్నుకోవడం అత్యవసరం. ఇది ఓటర్ డే. కొందరు ప్రత్యేకంగా మేము పాలిటిక్స్‌ని నమ్మం అంటారు. కానీ అది సరికాదు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి’ అని పిలుపునిచ్చారు. అనంతరం అల్లు అర్జున్ కూడా జూబ్లీహిల్స్‌లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.


Telangana E-Paper