అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి : జూ.ఎన్టీఆర్

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 07, 2018, 10:47 AM
 

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కోరారు. జూబ్లీహిల్స్‌‌లోని ఓబుల్ రెడ్డి స్కూలులో ఎన్టీఆర్ తన తల్లి, భార్య ప్రణతితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. క్యూలైన్‌లో అడిగిన వారికి సెల్ఫీలిస్తూ తారక్ ఓటుహక్కును వినియోగించుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.  ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగం, దేశం మనకు కల్పించిన హక్కు ఇది. ఆ హక్కును అందరూ వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే కంప్లైంట్ చేసే హక్కు లేదు. ఓటు వేయాలనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు… మనసా, వాచా, కర్మణా మనకు అనిపించాలి. నేను చెప్పాల్సింది ఒక్కటే. అక్క గెలవాలని మాత్రం కోరుకుంటున్నా’’ అన్నారు.


Telangana E-Paper