ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మలుస్తా : కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 17, 2018, 12:51 PM

హైదరాబాద్ : మీ అందరి మద్దతుతో సీఎం కేసీఆర్ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయ శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నానని, భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తాను అని టీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. మొన్ననే జరిగిన ఎన్నికల్లో అఖండమైన మెజార్టీ ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా టీఆర్ఎస్ ను ఆశీర్వదించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటాను. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మల్చడానికి పెద్దలు కేసీఆర్ నాకు ముఖ్యమైన బాధ్యత అప్పజెప్పారు. నాపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాను. పార్టీని అజేయమైన శక్తిగా మలిచే క్రమంలో మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను. బంగారు తెలంగాణ కోసం సవ్యంగా పని నిర్వర్తిస్తాను. పార్టీ కార్యాలయాల నిర్మాణం, శిక్షణ, సంస్థాగత నిర్మాణం కోసం కృషి చేస్తా. ప్రజలకు వందేళ్లు సేవ చేసేలా పార్టీ కార్యక్రమాలను తీర్చిదిద్దుతా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ ఉండేలా కృషి చేస్తాను. భగవంతుడు నాకిచ్చిన శక్తిని మీకోసం వినియోగిస్తా.. తనకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ వినమ్రంగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ.. శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.


TRS Party TRS Working President, Telangana Bhavan, KTR, CM KCR,










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com