ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియమైన అన్నయ్యకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ : ఎంపీ కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 17, 2018, 01:12 PM

 హైదరాబాద్ : యంగ్ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అంతకంటే ముందు ప్రగతి భవన్ లో కుటుంబ సభ్యుల మధ్య అన్న కేటీఆర్ కు సోదరి కవిత వీర తిలకం దిద్ది ఆశీర్వదించారు. పార్టీలో క్రియాశీలకమైన పాత్ర పోషించబోతున్న నా ప్రియమైన సోదరుడికి శుభాకాంక్షలు అని తెలుపుతూ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. కేటీఆర్ తల్లి శోభా, ఆయన సతీమణి శైలిమకు కూడా కవిత తిలకం దిద్దారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ప్రగతి భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. 


ఇక ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు బయల్దేరిన కేటీఆర్ కు పార్టీ శ్రేణులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. అశేష జనవాహిని మధ్య ప్రగతి రథంపై కేటీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించి.. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛాంబర్ లో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్ కు అభినందనలు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com