ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ పదవికి బాల్క సుమన్ రాజీనామా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 17, 2018, 02:12 PM

న్యూఢిల్లీ : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ సుమిత్రా మహాజన్ కు సుమన్ అందజేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపొందారు. 26,849 ఓట్ల మెజార్టీతో సుమన్ విజయం సాధించారు. శాసనసభకు ఎన్నికైన మల్లారెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మేడ్చల్ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మల్లారెడ్డి 87,990 ఓట్ల మెజార్టీ సాధించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com