హైదరాబాద తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు వేడుకలు టీఆర్ఎస్ - టాంజానియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ - టాంజానియా అధ్యక్షుడు వంగ నరసింహరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బొల్లకపల్లి నంద కిషోర్, మాట్లాడుతూ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో పాటు ఆనందకరమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్రం సాధించడానికి 14 సంవత్సరాలుగా పోరాడి, అనేకమంది యువకులకు ఒక ప్రేరణగా నిలిచారని కొనియాడారు. సీఎం పుట్టినరోజు కేవలం రాజకీయ నాయకుడి పుట్టినరోజుగా చూడకూడదన్నారు. ప్రపంచవ్యాప్తంగా "ప్రేరణ, మరియు త్యాగాల రోజు" గా చూడాలని చెప్పారు.కేసీఆర్ బర్త్‌డేకు దుబారా ఖర్చులు చేయొద్దని టీఆర్ఎస్ శ్రేణులకు ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సూచించారు. అందువల్ల టిఆర్ఎస్ టాంజానియా తన పుట్టినరోజును రోజువారీ అత్యవసర వస్తువులని విరాళంగా ఆర్ఫనేజ్‌లో ఇచ్చి జరుపుకుంది. టిఆర్ఎస్ టాంజానియా సభ్యులు ఈ సందర్భంగా పిల్లలకు బ్రెడ్, కేకులు మరియు జ్యూస్ పంపిణీ చేశారు.