ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 12:09 PM

మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్  తెలంగాణ రాష్ట్ర మంత్రిగా దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ శ్రీనివాస్ గౌడ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీనివాస్ గడ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉద్యమంలో కీ రోల్ నిలిచాడు.తెలంగాణ రాష్ట్ర మంత్రిగా వేముల ప్రశాంత్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ వేముల ప్రశాంత్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. బాల్కొండ నుంచి ఎమ్మెల్యే గా గెలుపొందిన వేముల ప్రశాంత్ రెడ్డి మిషన్ భగీరత వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్థించారు. వనపర్తి నియోజక వర్గంనుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నిరంజన్‌రెడ్డి గతంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.పాలకుర్తి నియోజక వర్గంనుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com