ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను కాబినెట్ లోకి తీసుకోలేద‌న్న బాధ లేదు : హరీష్ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 01:23 PM

 కేసీఆర్‌ ఆదేశాలను క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పారు. ఎన్నికల ముందే ఈ విషయం చాలాసార్లు చెప్పానన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయా ప్రాంతాలు, సామాజిక వర్గాలు తదితర సమీకరణాలను చూసుకుని కేసీఆర్‌ మంత్రులను ఎంపిక చేశారని ఆయన చెప్పారు.  మంత్రి పదవి దక్కనందున తనకు ఎటువంటి అసంతృప్తీ లేదని తాజా మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పారు.తనకు ఎటువంటి గ్రూప్‌లు, సేనలు లేవని స్పష్టం చేసిన హరీష్‌.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు.. కేసీఆర్‌కు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com