ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగ్, యువకుడు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 06:57 PM

హైదరాబాద్ లో బైక్ రేసింగ్ కల్చర్ రోజురోజుకి పెరిగిపోతుంది. ఎక్కడో నగరశివారున రాత్రి వేళల్లో జరిగే ఈ రేసింగ్ తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్డు కేంద్రంగా జరుగుతుంది. నిత్యం జరిగే ఈ రేసింగులతో ప్రాణాలు పోతున్నా యువత మాత్రం ఈ వ్యసనాన్ని వదలలేకపోతున్నారు. ఈరోజు నెక్లెస్ రోడ్డులో బైక్ రేసింగ్ జరుగుతుండగా ఓ బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. రేసింగ్ వలనే ప్రమాదం జరిగిందని పోలీసులే చెప్తుండగా ఇకపై ఇలాంటివి జరగకుండా కట్టడి చేస్తామని చెప్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com