ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగర పోలీసులకు అమెరికన్ కాన్సులేట్ జనరల్ ప్రశంసలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 07:49 AM

హైదరాబాద్ : అంతర్జాతీయ స్థాయిలో పాస్‌పోర్టులను ట్యాంపరింగ్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంపై హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డా ప్రశంసలు కురిపించారు. దేశ సమగ్రతను కాపాడడంలో హైదరాబాద్ పోలీసుల పనితీరు అభినందనీయమన్నారు. సోమవారం పాస్‌పోర్టు ట్యాంపరింగ్ ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఉంటూ విదేశాల్లో పాస్‌పోర్టు పొందినట్లు సృష్టించి, దాని ద్వారా ఇతర దేశాలకు వెళ్లేందుకు వీసాలను పొందుతున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీంతో హైదరాబాద్ పోలీసులకు ఆమె ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. నకిలీ పాస్‌పోర్టులను సృష్టించిన భారీ ముఠాను పట్టుకున్నారని కొనియాడారు. డాక్యుమెంట్ల భద్రత కూడా అన్ని దేశాలకు ఎంతో అవసరమన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com