ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’లో హెడ్ కానిస్టేబుల్‌గా గోరేటి వెంకన్న

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 10:06 PM

కవి, గాయకుడు గోరెటి వెంకన్న ‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’ సినిమాలో నటించారు. ఈ చిత్రంలో గోరటి వెంకన్న హెడ్ కానిస్టేబుల్ సురేందర్ పాత్ర పోషించారు. ఆయనకో అందాల కూతురు వుంటుంది. ఆయన నిజ జీవితానికి చాలా దగ్గరగా వుండే పాత్రను ఈ సినిమాలో పోషించారాయన. ఆ పాత్రలో ఆయన నటించారు అనేకన్నా జీవించారు అని చెప్పాలి. ఈ బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రం మార్చి రెండవ వారంలో విడుదలకు రెడీ అవుతోంది. శ్రీనాథ్, మేఘన హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు నాగసాయి మాకం దర్శకత్వం వహించారు. పాటలు, ట్రైలర్ ఈమధ్యే విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహాంకాళి శ్రీనివాసులు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ..‘కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునే చిత్రమిది. గోరటి వెంకన్న మా సినిమాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఈ పాత్రకు చక్కగా కుదిరారు. ఆయనైతేనే ఈ పాత్రకు న్యాయం చేయగలరని ఆయనను ఒప్పించి ఈ సినిమాలో నటింపజేశాం. హెడ్ కానిస్టేబుల్ పాత్ర గుర్తుండిపోతుంది. ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేని కథా కథనాలు ఈ చిత్రంలో ఉంటాయి. బిలాల్ పూర్ అనే ఊరి పోలీస్ స్టేషన్‌కు వచ్చే వింత వింత కేసుల చుట్టూ సినిమా కథ నడుస్తుంది. సినిమా చూస్తున్న వాళ్లకు తమ ఊరిలో జరిగే సంఘటనలు గుర్తొస్తాయి’ అని తెలిపారు. మల్లేష్ బాలాస్ట్, ప్రణవి,  వైభవ్, ఆర్‌ఎస్ నందా, వెంకట్ గోవాడ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ-తోట వి రమణ, ఎడిటింగ్-ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం-సాబూ వర్గీస్, రీ రికార్డింగ్-జీబూ, డీటీఎస్-రాజశేఖర్, పాటలు-గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనశ్రీ మల్లిక్, నీల నర్సింహా, కథా, నిర్మాత-మహాంకాళి శ్రీనివాసులు, రచన, దర్శకత్వం-నాగసాయి మాకం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com