ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నారాయణ స్కూల్లో అగ్నిప్రమాదం..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 10:32 PM

హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని నారాయణ స్కూలు విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్కూలులోని ఓ తరగతి గదిలో ఉన్న ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్కూలు మొత్తం పొగ వ్యాపించింది. ఏం జరుగుతుందో తెలియని సిబ్బంది, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com