ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 03:58 PM

లక్నో: కాంగ్రెస్‌తో ఏ రాష్ట్రంలోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి. ఈ ప్రకటనతో యూపీలో మహాకూటమి ప్రతిపాదనకు దారులు మూసేశారు. బీఎస్పీ నేతలతో మంగళవారం ఉదయం సమావేశమైన మాయావతి.. ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే యూపీలో బీజేపీని ఓడించడానికి తమ మధ్య ఉన్న వైరాన్ని పక్కన పెట్టి ఎస్పీ, బీఎస్పీ చేతులు కలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ కూటమిలో కాంగ్రెస్ ఎంట్రీని మాత్రం మాయావతి తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల తమకు పెద్దగా ఒరిగిందేమీ లేదన్నది ఆమె వాదన. ఆ పార్టీ నుంచి తమకు ఓట్ల బదిలీ జరగలేదని మాయా చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల తమకు కలిగే లబ్ధి ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం బెడసికొట్టడంతో ఆ పార్టీని మరింత దూరం పెట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com