టికెట్ల విషయంలో టీఆర్ఎస్ ఏమాత్రం తొందరపడడం లేదు. లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నది.అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి, ఆలోచించిన తరవాతే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో సిట్టింగ్ ఎంపీ లతో కేసీఆర్ లంచ్ భేటీకి అవకాశం. సిట్టింగ్ ఎంపీలతో చర్చించిన తరవాతే నిర్ణయం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకోనున్నారు.