హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్లో చేరనున్న సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్‌కు వచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి భేటీ కానున్నారు. కార్తీక్ రెడ్డికి ఎంపి టికెట్ ఇవ్వనందుకు నిరసనగా కాంగ్రెస్‌నుంచి బైటికి రావాలని సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆమె యోచిస్తున్నారు.