రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ధరూర్ మండలం ఎబ్బనూరు గేట్ సమీపంలో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.