యువకుడి దారుణ హత్య

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 07:49 PM
 

నగరంలోని సైదాబాద్‌ కిరణ్‌బాగ్‌ కాలనీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మలక్‌పేట తిరుమల హిల్స్‌కు చెందిన కార్తిక్‌(27) కటింగ్‌ చేయించుకున్న తరువాత డబ్బుల చెల్లింపు విషయంలో వాగ్వాదం జరిగింది. ఘర్షణకు దారితీయడంతో షాప్‌ యజమాని మరో నలుగురు కలిసి కార్తిక్‌పై దాడి చేశారు. కిందపడిపోయిన కార్తిక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Telangana E-Paper