ఆంధ్రాకి కెసిఆర్ లేని లోటు తీర్చేస్తున్నాడు!

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 09:05 PM
 

కేసీఆర్‌.. ఈ మూడక్షరాల పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేవి పదునైన మాటలే.. ఈ బక్కపల్చటి మనిషి తన మాటలనే బ్రహ్మాస్త్రాలు ప్రయోగించి రాజకీయాల్లో అత్యున్నత స్థానానికి చేరాడు. ఆయన మాటలు ఓ బ్రాండ్.. అలా ఇంకొకరు మాట్లాడలేరు. ప్రజల్ని మాటల మాయాజాలంతో ఆకట్టుకోలేరు. ఏపీలో కేసీఆర్‌ లా మాటలతో మాయ చేయగల నాయకులు చాలా తక్కువ. ఇప్పుడు ఏపీకి ఆ లోటు తీర్చేలా కనిపిస్తునాడో వైసీపీ కుర్ర లీడర్. ఆయన పేరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌  రెడ్డి తమ్ముడు కుమారుడు సిద్దార్థరెడ్డి. పెదనాన్న ఇటీవలే టీడీపీలోకి వెళ్తే.. ఈ కుర్రాడు మాత్రం వైసీపీలో చేరాడు. జగన్ అంటేనే మండిపడే బైరెడ్డి కుటుంబం నుంచి సిద్దార్థరెడ్డి వైసీపీ వైపు వెళ్లడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇప్పుడా కుర్రాడు తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకుంటు న్నాడు. జంకూగొంకూ లేకుండా.. అడ్డు అలుపూ లేకుండా అలవోకగా ఆ కుర్రాడు చేస్తున్న ప్రసంగాలు వైసీపీకి ప్లస్ పాయింట్ గా మారాయి. ఆయన చంద్రబాబు రాజకీయ విధానంపై సెటైర్లు పేలుస్తూ అచ్చు కేసీఆర్ తరహాలోనే చంకనాలేదు.. వంటి పదాలనూ సింపుల్ గా వాడుక భాషలో కలిపేసి వదులుతున్నాడు. 


 


Telangana E-Paper