తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల!

  Written by : Suryaa Desk Updated: Sat, Apr 20, 2019, 09:28 PM
 

తెలంగాణలో జరగబోయే ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు విడుదల చేసింది. మే 16 నుంచి మే 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించ నున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇక గురువారం తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.


Telangana E-Paper