మక్తల్లో తప్పిపోయిన అఖిల(7) ఆచూకీ లభించింది. చిన్నారి కనిపించడం లేదని ఐదురోజుల క్రితం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కింటి మేడపై ఆడుకుంటూ చిన్నారి ప్రమాదవశాత్తు స్నానాలగదిలో పడిపోయింది. కాగా ఇంటి యజమాని లేకపోవడంతో చిన్నారి ఆ స్నానాలగదిలోనే ఉండిపోయింది. ఐదురోజులుగా నీళ్లు తాగుతూ స్నానాలగదిలోనే బిక్కుబిక్కుమంటూ జీవించింది. నిన్న రాత్రి ఇంటి యజమాని చిన్నారిని గమనించి తల్లిదండ్రులకు అప్పగించాడు.