భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూర్కల్ ఇటీవల 46వ పుట్టినరోజును జరుపుకున్నాడు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. సచిన్ ఆయురారోగ్యంతో ఉండాలంటూ వారు అభినందనలు తెలిపారు. వారిలో సచిన్ సన్నిహితుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా ఉన్నాడు.స్నేహాన్ని గుర్తుచేస్తూ ఓ పాటను పాడిన కాంబ్లీ, సచిన్‌కు విషెస్ చెప్పాడు. అయితే దీనిపై సచిన్ చాలా ఫన్నీగా స్పందించాడు. ‘‘నీ అభినందనలకు చాలా థ్యాంక్స్. పాట చాలా బావుంది. కానీ నీ గడ్డం తెల్లగా ఉండి, కనుబొమలు నల్లగా ఎలా ఉన్నాయో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో వీరిద్దరి కన్వర్జేషన్‌ను చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.