రానున్న మూడు గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది.