బైక్‌ను ఢీకొన్న ఎంఈవో కారు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 03:19 PM
 

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధి సీతారాంగేట్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇబ్రహీంపట్నం ఎంఈవో కారు అదుపుతప్పి బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని జీవన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో దంపతులు మృతిచెందారు. మృతులను మంచాల మండలం ఆరుట్లకు చెందిన అంజయ్య, గడ్డమ్మ గా గుర్తించారు.


Telangana E-Paper