రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: షబ్బీర్‌అలీ

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 04:45 PM
 

హైదరాబాద్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ అన్నారు. సీఎం మాత్రం ఎన్నికలు తప్ప మరో ధ్యాస లేనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కరువుపై చర్చించేందుకు వారం రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలన్నారు. నిధులు ఇవ్వకపోవడంతో ఆరోగ్యశ్రీ అమలు కావడంలేదని ఆయన చెప్పారు. కాళేశ్వరం తప్ప మరో సమస్యను పట్టించుకోరా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.