వర్ధన్నపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి ఎర్రబెల్లి

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 05:44 PM
 
రానున్న మూడు నెలల్లో వర్ధన్నపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై అధికారులతో మంత్రి నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ సహకారంతో వర్ధన్నపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఆడిటోరియం, స్మశానవాటిక, సీసీ రోడ్లు, మోడల్ మార్కెట్, మటన్, చికెన్ షాపులకు ప్రత్యేక భవనాలను నిర్మిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మహిళలకు గౌరవం, స్వేచ్ఛ లభించిందన్నారు. ఆడబిడ్డలు నీళ్ల కోసం కష్టాలు పడొద్దని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు