కేసీఆర్ పర్యటనకు సంబంధించి సూచనలు చేసిన హరీశ్‌ రావు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 08:45 PM
 

సీఎం కేసీఆర్ తన సొంత గ్రామం చింతమడక పర్యటన నేపధ్యంలో అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే హరీశ్‌రావు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పలు సూచనలు చేశారు. కేసీఆర్ సొంత గ్రామం చింతమడకలో ఆయన ఒక రోజంతా గడపనున్నారు. గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకో నున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో బీసీ గురుకుల పాఠశాల వసతి గృహానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించనున్న నేపథ్యలో వాటిని కూడా హరీశ్‌రావు పరిశీలించారు. స్ధానిక ఐకేపీ గోదాం సీసీ ప్లాట్‌ఫామ్ వద్ద సీఎం సభ నిర్వహించాలని, దాదాపు 3,200 మంది గ్రామస్థులకు, 200 మంది అధికారులకు కుర్చీలు ఏర్పాటుచేయాలని, మరో 200 కుర్చీలతో ప్రెస్‌గ్యాలరీ ఏర్పాటుచేయాలని సూచించారు.పెద్దమ్మ దేవాలయ ప్రాంగణాన్ని పరిశీలించిన హరీశ్‌రావు దాని పక్కనున్న చింతచెట్టు కింద సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేయనున్న  నేపథ్యంలో అక్కడ  జరుగుతున్న ఏర్పాట్లపై కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో ఆయన  చర్చించారు.


Telangana E-Paper