నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మంచు మనోజ్ ఓటు

  Written by : Suryaa Desk Updated: Tue, Jul 16, 2019, 08:53 PM
 

మున్సిపల్ ఎన్నికల జాబితాలు తప్పుల తడకగా మారాయి. సాక్షాత్తు సినీ హీరో మంచు మనోజ్ ఓటు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. మున్సిపాలిటీలో వార్డుల విభజన చేశారు. రెండవ వార్డులో 428 నెంబర్‌తో సినీ హీరో మంచు మనోజ్ ఫొటోతో ఓటరు కార్డు ఉంది. తండ్రి పేరు మోహన్ బాబు పేరు కూడా ఉంది. దీన్ని గమనించిన బీజేపీ నాయకులు మంచు మనోజ్ ఓటును తొలగించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అయితే ఇది పొరపాటున జరిగిందా? లేక ఆకతాయి తనంగా కావాలనే చేశారా? అనే కోణంలో విచారణ సాగుతోంది. కాగా తహశీల్దార్‌ను లిఖితపూర్వక వివరణ కోరారు. బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.


 


Telangana E-Paper