కాషాయ గూటికి చేరిన మాజీ ప్రధాని కుమారుడు!

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 08:40 AM
 

మరోసారి కేంద్రంలో గద్దెనెక్కిన తర్వాత బీజేపీ యావత్ దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం మీద ప్రత్యేకదృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆయా రాష్ట్రాలలో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తూ నేతలను తమ గూటికి చేరిన నేతలకు కండువాకప్పి సాదరంగా ఆహ్వానిస్తుంది. ఈక్రమంలోనే మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ సమక్షంలో మంగళవారం బీజేపీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎస్పీకి దూరంగా ఉంటున్న నీరజ్‌ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.