బీజేపీ వైపు చూస్తున్న కొండా దంపతులు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 11:20 AM
 

తెలంగాణలో కీలక రాజకీయ నేతలైన కొండా మురళి, కొండా సురేఖ దంపతులు పార్టీ మారనున్నారా? దీనికి ఔననే సమాధానం వస్తోంది. కొండా దంపతులు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తమ కూతురుకి భూపాలపల్లి టికెట్ ఇవ్వాలనే షరతును వీరు బీజేపీ ఎదుట పెట్టినట్టు సమాచారం. గత ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసిన సురేఖ, ఓటమిపాలైన సంగతి తెలిసిందే.మరోవైపు, గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణ కూడా బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. కొండా దంపతులు, గండ్ర ఇద్దరూ భూపాలపల్లి టికెట్ కోసం డిమాండ్ చేస్తుండటంతో కొంత సందిగ్ధత నెలకొందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.