కాసేపట్లో తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 11:21 AM
 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కొద్దిసేపట్లో తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు ఎలా ఉన్నాయన్నదానిపై పార్టీ బాధ్యులు, ముఖ్యులను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే తెలంగాణ భవన్‌లో పార్టీ అనుబంధ విభాగాలకు కార్యాలయాల నిర్మాణంపై కూడా పార్టీ బాధ్యులతో చర్చించనున్నారు.