అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు : సీపీ

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 11:22 AM
 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనసభా ప్రాంగణానికి 4 కిలో మీటర్ల పరిధిలో పలు ఆంక్షలు విధిస్తున్నట్టు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ప్రకటించారు. ప్రజలు గుమికూడడం, సమావేశాలు, ర్యాలీలు, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే వివిధ అంశాలను నిషేధిస్తున్నట్టు సీపీ తెలిపారు. ఈ నిషేదాజ్ఞలు ఈ నెల 18న ఉదయం 6 నుంచి 20న ఉదయం 6 వరకు అమల్లో ఉంటాయన్నారు.