టీవీ9 యాంకర్, కత్తి మహేశ్ లపై పోలీసులకు సినీ నటి సునీత ఫిర్యాదు!

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 11:27 AM
 

టీవీ 9షోలో నిర్వహించిన ఓ షోలో పాల్గొన్న తనను యాంకర్ సత్య, అదే షోలో తనతో పాటు పాల్గొన్న కత్తి మహేశ్ లు అసభ్యంగా ప్రవర్తించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నినీ నటి బోయ సునీత బంజారాహిల్స్‌పోలీస్‌ స్టేషన్‌ ను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, గత సంవత్సరం క్యాస్టింగ్‌ కౌచ్‌ పై వివాదం చెలరేగిన వేళ, ఏప్రిల్‌ 14న టీవీ9లో జరిగిన చర్చలో సునీత పాల్గొంది. యాంకర్‌ సత్య సంధానకర్తగా ఉన్న చర్చలో కత్తి మహేష్, నిర్మాత ప్రసన్నకుమార్‌ కూడా పాల్గొన్నట్టు సునీత తన ఫిర్యాదులో పేర్కొంది. కత్తి మహేష్‌ మహిళలు, తన పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, దీనిపై అప్పట్లోనే తాను కేసు పెట్టానని ఆమె వెల్లడించింది. అయితే వారిపై ఇంతవరకూ తీసుకోలేదని, నిన్న తాను టీవీ9 స్టూడియోకు వెళ్లితే మరోసారి అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయగా, దీన్ని స్వీకరించిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించినట్టు తెలిపారు.


Telangana E-Paper