బాలిక కుటుంబానికి రూ.5లక్షలు అందించాలి : మందకృష్ణ

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 11:44 AM
 

ఖమ్మం హాస్టల్‌లో మృతిచెందిన బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లో రూ.5లక్షల ఆర్ధిక సాయాన్ని అందజేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈఘటనపై ఇవాళ ఖమ్మం కలెక్టర్‌ను కలిసి ఆయన ఓ వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… మృతిచెందిన బాలిక కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ తో పాటు మూడు ఎకరాల భూమిని అందజేయాలన్నారు. అలాగే గురుకుల పాఠశాలలకు ఏవిధంగా కేటాయింపులు చేస్తారో రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లకు కూడా అదేవిధంగా నిధులు కేటాయించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.


Telangana E-Paper