ఉరేసుకొని ఖైదీ ఆత్మహత్య

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 12:05 PM
 

నిజామాబాద్‌ : జిల్లా జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. కిటికీకి టవల్‌తో ఉరి వేసుకొని ఖైదీ వెంకటేష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ హత్య కేసులో వెంకటేష్‌కు న్యాయస్థానం ఇటీవలే జీవిత ఖైదు విధించింది. మృతుడు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ వాసి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


 


 


Telangana E-Paper