మొయినాబాద్‌లో బాలిక కిడ్నాప్‌కు యత్నం

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 01:46 PM
 

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బాలిక కిడ్నాప్‌కు యత్నం జరిగింది. మాయమాటలు చెప్పి చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు వ్యక్తి ప్రయత్నించారు. గమనించిన స్థానికులు కిడ్నాపర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కిడ్నాపర్‌ను పోలీసులకు అప్పగించారు.