బాలిక ను కిడ్నాప్‌ చేసేందుకు యత్నం

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 02:30 PM
 

రంగారెడ్డి : మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తిని గ్రామస్థులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌ మండలం చిలుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక సమాచారం మేరకు.. మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి స్కూటీ పై ఎత్తుకెళ్లేందుకు కిడ్నాపర్‌ ప్రయత్నిస్తుండగా.. బాలిక కేకలు వేయడంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. కిడ్నాపర్‌ ను చితకబాది పోలీసులకు అప్పగించారు.


Telangana E-Paper