అసెంబ్లీని కేసీఆర్ కుటుంబ వ్యవహారంగా మార్చేశారు: కాంగ్రెస్ నేత సంపత్ కుమార్

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 02:34 PM
 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీని రాచరికపు, కుటుంబ వ్యవహారంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్థకతలేని అసెంబ్లీ సమావేశాలు దేశం మొత్తం మీద తెలంగాణలోనే జరుగుతున్నాయని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సంపత్ కుమార్ మాట్లాడారు. తన నిర్వాకాలపై ప్రశ్నించేవారిని కేసీఆర్ అణచివేస్తున్నాడని సంపత్ కుమార్ అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో వ్యవసాయం పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ప్రజల సొమ్మును రాజకీయ అవసరాలకు కేసీఆర్ వాడుకుంటున్నారనీ, ఆయనకు భవిష్యత్తులో జైలుశిక్ష తప్పదని సంపత్ కుమార్ హెచ్చరించారు.