నేను పార్టీ మారడం లేదు : జూపల్లి కృష్ణారావు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 03:15 PM
 

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు ఆవాస్తమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతిపక్షాలు కావాలనే తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పూటకో పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. కావాలనే కొందరు తనపై కుట్రపన్ని పార్టీ మారతారంటూ దష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారే ప్రసక్తే లేదని, సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. కొల్లాపూర్‌ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో  కొల్లాపూర్‌ నుంచి పోటీ చేసిన జూపల్లి.. కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్థన్‌రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.