జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాది హతం

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 04:42 PM
 

 జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ పట్టణంలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. సోపోర్‌కు సమీపంలోని గుండ్‌బ్రాత్‌ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు బలగాలకు సమాచారం అందడంతో ఇవాళ ఉదయం అక్కడ కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతని వద్ద ఉన్న ఆయుధాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముందస్తు జాగ్రత్తగా సోపోర్‌ పట్టణంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.


Telangana E-Paper