ఎర్రమంజిల్ సచివాలయం పురాతన భవనం కాదన్న టీసర్కార్

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 17, 2019, 06:10 PM
 

ఎర్రమంజిల్ సచివాలయం పురాతన భవనం కాదని.. హెరిటేజ్ భవనాల జాబితాలో ఆ భవనం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై ఈరోజు హైకోర్టులో వాదనలు జరగగా ఏ ప్రాతిపదికన పురాతన భవనాలకు కూల్చివేశారని కోర్టు ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనం హెరిటేజ్ జాబితాలో లేదని, చారిత్రక కట్టడాల కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి వాయిదాను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.


Telangana E-Paper