ఇక తెలంగాణ‌లో 57 ఏళ్ల‌కే వృద్ధాప్య‌పు పించ‌ను

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 18, 2019, 01:49 AM
 

ఇక తెలంగాణాలో  57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అంద‌జేయాల‌ని రాష్ట్ర కేబినెట్ నిర్ణ‌యించింది.  ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో 60 ఏళ్ల‌వారిని వృద్ధులుగా ప‌రిగ‌ణిస్తుండ‌గా ప్ర‌స్తుతం ఈ  పథకంలోకి 57 ఏళ్ల వారిని తీసుకురావాల‌ని బుధ‌వారం జ‌రిగిన కేబినెట్ నిర్ణ‌యానికి వ‌చ్చి ఆమోదం తెలిపింది.    త‌క్ష‌ణ‌మే ఈ ప‌థ‌కాన్ని అమ‌లులోకి తీసుకువ‌చ్చేలా 57 ఏళ్లు నిండిన వారి జాబితా సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలందాయి.   ఈ నెల 20న పెంచిన పింఛన్ల ప్రొసీడింగ్స్‌ను లబ్ధిదారులకు అందజేయాలని  ప్రొసీడింగ్స్‌ ముగిసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేయాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు.


Telangana E-Paper