ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బిగ్ బాస్ 3' వివాదంపై స్పందించిన నూకారపు సూర్యప్రకాష్ రావు

mukha mukhi |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2019, 12:33 PM

నందిగాన రామచంద్ర (విజయవాడ) గారి ప్రశ్న :
ఇటీవల కొంత కాలంగా బిగ్ బాస్ 3 వ్యవహారంపై రచ్చ జరుగుతోంది. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ ఇండ్రస్ట్రీలో ఉందని అనేక ఆరోపనలు వస్తున్న నేపథ్యంలో ఇదే తరహాలో బిగ్ బాస్ లోనూ ఉందని ఓ జర్నలిస్టు, ఓ సినీనటి ఆరోపించడం ఆందోళన కలిగించేదే ఈ విషయమై మీరేమంటారు? నందిగాన రామచంద్ర, విజయవాడ

నూకారపు సూర్యప్రకాష్ రావు గారి సమాధానం :
మీరన్నది నిజమే రామచంద్రగారు! బిగ్ బాస్ 1,2లలో కనిపించని హంగామా బిగ్ బాస్ 3 లో కనిపించింది. తొలుత హోస్ట్ ఎవరన్న విషయంపైనా అనేక పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పుడు వీక్షకులలో ఉత్కంఠ రేపింది. చివరికి నాగార్జున పేరు ఖరారు కావటంతో తెరపడినా, శ్వేతారె డ్డి, గాయత్రి గుప్తాల ఆరోపణలు ఆలోచింప చేసేలానే ఉన్నాయి. అయితే నాగార్జున తత్వం ఎరిగిన వారేవ్వరైనా, మహిళలని అగౌరపరిచేలా ఉంటే ఆయన ఖచ్చితంగా కాదని స్పష్టంగా చెప్పేవారు. కానీ జరుగుతున్న విషయం వేరేలా కనిపిస్తోంది. క్రింది స్థాయి ఉద్యోగులు, ఎంపిక విషయం లో చేసిన తప్పులే ఇప్పుడు నిర్వాహకుల మెడకు చుట్టుకుని, చివరకి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొందన్నది వాస్తవంగా కనిపిస్తోంది. కోర్టు నిర్వాహకులు అరెస్టు వద్దని నిర్దేశించినా, నిరసన సెగలు మాత్రం ఆగటం లేదు. ఈ నిరసన సెగ ఢిల్లీ వరకూ చేసింది.. బిగ్ బాస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని.. ఈ షో స్త్రీలపై అగౌరవ పరిచేట్లుగా ఉన్నందున ప్రసారం కాకుండా అడ్డుకోవాలంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతుంటే, ఈ ఇష్యూపై ఇంత రచ్చ జరుగుతున్నా.. హోస్ట్ చేస్తున్న నాగార్జున కనీసం స్పందించలేదన్న అభ్యంతరాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమానికి తెరపై కనిపించే ప్రధాన పాత్రధారి ఆయనే కనుక పూర్తి బాధ్యత ఆయనే వహించాలంటూ విద్యార్థి లోకం నేరుగా నాగార్జున ఇంటి వద్ద నిరసన తెలిపారు. ముఖ్యంగా ఓయూ జేపని పిలుపు మేరకు పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చి, నాగార్జున డౌన్.. డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఏది ఏమైనా ఈ విషయంలో నాగార్జున స్పందించడం అత్యవసరమని చెప్పక తప్పదు. చూద్దాం మరి ఈ విషయం ఎక్కడిదాకా వెళ్తుందో..!


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com