ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీ రాజీనామా గురించి నూకారపు సూర్యప్రకాష్ రావు గారి మాటలు ....

mukha mukhi |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2019, 01:35 PM

నిష్టల కృష్ణమూర్తి, రిటైర్డ్ టీచర్, విజయనగరం గారి ప్రశ్న :
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను దూరంగా జరపటం, జూనియర్లకు ప్రాధాన్యత ఇచ్చినా పార్టీని పుంజుకునేలా చేయటంలో విఫలమవ్వటమే చివరికి జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని నేను భావిస్తున్నా మీ అభిప్రాయమేమిటి? నిష్టల కృష్ణమూర్తి, రిటైర్డ్ టీచర్, విజయనగరం


నూకారపు సూర్యప్రకాష్ రావుఐ సమాధానం:
మీరన్నది నిజమేననిపిస్తోంది మాస్టారు! ఎన్నికల ముందు నుంచి పార్టీలో సీనియర్లను దూరంగా జరపటం ప్రచారంలో పూర్తి బాధ్యతలు వారికి అప్పగించకుండా తన కంటూ ఏర్పాటు చేసుకున్న టీమ్ నే నమ్ముకోవటం వల్ల కాంగ్రెస్ కు నష్టం జరిగిందన్నది కార్యకర్తలు కూడా చెపుతున్న మాట. దీనికి తోడూ సీనియర్ల ప్రచార వ్యూహాలను అందిపుచ్చుకోలేకపోవటం, అవసరమైన ప్రణాళికలు రచించుకుంటూ బిజెపి ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనటంతో విఫలం అయ్యారన్న వాదనలూ లేకపోలేదు. ఇప్పటికీ గాంధీ కుటుంబం నాయకత్వం లేని కాంగ్రెస్ సంస్థాగత కార్యకర్తలు కూడా ఊహించుకోలేకున్నరు. ఈ కారణంగానే సీనియర్లు సైతం రాహుల్ రాజీనామా, తదుపరి కనీసం తాత్కాలికంగా కూడా అధ్యక్షస్థానం అందుకునేందుకు నిరాకరిస్తున్నారనిపిస్తోంది. మరి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నిర్ణయించాల్సింది నిర్దేశించాల్సింది ప్రజలే అనిపిస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com